Home క్రీడలు 6 బంతుల్లో 34 పరుగులు.. ఊరమాస్ బ్యాటింగ్‌తో బౌలర్ల బెండు తీసిన ఆల్ రౌండర్.. వైరల్...

6 బంతుల్లో 34 పరుగులు.. ఊరమాస్ బ్యాటింగ్‌తో బౌలర్ల బెండు తీసిన ఆల్ రౌండర్.. వైరల్ వీడియో..

55
0

Usama Mir Batting: పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్ తన జాతీయ జట్టు తరపున బౌలర్‌గా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్ తన జాతీయ జట్టు తరపున బౌలర్‌గా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే, తాజాగా ఒక మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించాడు. ఒకే ఓవర్‌లో సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ ఓవర్‌లో ఉసామా మీర్ 6,6,6,6,4,6లతో భారీ షాట్లు ఆడాడు. అతని భీకర బ్యాటింగ్‌ను చూసి ప్రేక్షకులతోపాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. ఉసామా తన బౌలింగ్‌తో పేరు గాంచాడు. కానీ, ఇలా తుఫాన్ బ్యాటింగ్ చేయడంతో ఒక్కసారి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు.

20 బంతుల్లో 66 పరుగులు..

ప్రస్తుతం ఘనీ రంజాన్ టోర్నీ 2023 పాకిస్థాన్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఘనీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (జీఐసీ) వర్సెస్ కరాచీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉసామా మీర్ ఘని ఇన్స్టిట్యూట్ బృందంలో భాగంగా ఉన్నాడు. ఈ సమయంలో, అతను కరాచీ వారియర్స్ బౌలర్లను చిత్తు చేస్తూ 20 బంతుల్లో 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన ఇన్నింగ్స్‌లో ఏ బౌలర్‌ను విడిచిపెట్టలేదు.