Home లైఫ్ స్టైల్ Godfather: పూరి డైరెక్షన్‌లో మెగాస్టార్‌ సినిమా.. ఆటోజానీ కన్నా పవర్‌ఫుల్‌ స్ర్కిప్ట్‌తో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే

Godfather: పూరి డైరెక్షన్‌లో మెగాస్టార్‌ సినిమా.. ఆటోజానీ కన్నా పవర్‌ఫుల్‌ స్ర్కిప్ట్‌తో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే

గాడ్‌ఫాదర్‌ సినిమాలో జర్నలిస్ట్‌ గోవర్ధన్‌ అనే కీలక పాత్రలో కనిపించారు పూరి. అయితే సినిమా సక్సెస్‌మీట్‌లో ఎక్కడా ఆయన కనిపించలేదు. దీంతో దీంతో పూరీకి ఏమైంది? చిరంజీవి సక్సెస్‌ మీట్‌కి ఎందుకు రాలేదు? అన్నది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగుతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈసినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమాను మరింతగా ప్రమోట్‌ చేస్తోందీ చిత్రబృందం. కాగా గాడ్‌ఫాదర్‌ సినిమాలో జర్నలిస్ట్‌ గోవర్ధన్‌ అనే కీలక పాత్రలో కనిపించారు పూరి. అయితే సినిమా సక్సెస్‌మీట్‌లో ఎక్కడా ఆయన కనిపించలేదు. దీంతో దీంతో పూరీకి ఏమైంది? చిరంజీవి సక్సెస్‌ మీట్‌కి ఎందుకు రాలేదు? అన్నది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ అనుమానాలకు తెరదించుతూ స్వయంగా పూరీ జగన్నాథ్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా మెగాస్టార్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా గాడ్‌ఫాదర్‌ సినిమాతో పాటు ఇద్దరి ఫ్యూచర్‌ ప్రాజెక్టులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కాగా గతంలో మెగాస్టార్‌ రీఎంట్రీ కోసం పూరి ఆటోజానీ పేరుతో ఓ సినిమా స్ర్కిప్ట్‌ చేశారు. అయితే ఎందుకోగానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆతర్వాత ఆటోజానీపై పలు వార్తలు వచ్చినా అవి వదంతులు గానే మిగిలిపోయాయి. తన సినిమాల్లో హీరోయిజాన్ని ఓ రేంజులో ఎలివేట్‌ చేసే పూరి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పూరి-మెగా కాంబోపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆటోజానీ కన్నా బలమైన స్ర్కిప్టుతో మెగాస్టార్‌ను కలుస్తానని పూరీ తెలిపారు. అన్నయ్యను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఈ చిత్రం ఉంటుందని పూరి పేర్కొన్నారు. దీంతో మళ్లీ పూరి- మెగా కాంబినేషన్‌పై ఆశలు రేకెత్తాయి. ఇంకా తమ సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు పూరి, మెగాస్టార్‌. మరి ఆ విశేషాలేంటో ఈ కింది వీడియోలో చూడండి.