Home లైఫ్ స్టైల్ Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!

Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!

48
0

ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా తయారయ్యారు. పెరిగిన టికెట్ రేట్ కూడా వాళ్లని ఎక్కువగానే భయపెడుతోంది. చిన్న సినిమాకెళ్లాలన్నా పెద్ద రేట్ ఆడియెన్స్ కి అడ్డంకిగా మారుతోంది. దీంతో జనం థియేటర్స్ కి రాక చాలా సినిమాలే నష్టపోతున్నాయి.

Movie Ticket Rates: ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా తయారయ్యారు. పెరిగిన టికెట్ రేట్ కూడా వాళ్లని ఎక్కువగానే భయపెడుతోంది. చిన్న సినిమాకెళ్లాలన్నా పెద్ద రేట్ ఆడియెన్స్ కి అడ్డంకిగా మారుతోంది. దీంతో జనం థియేటర్స్ కి రాక చాలా సినిమాలే నష్టపోతున్నాయి. అందుకే తన సినిమాను మాత్రం రెగ్యులర్ రేట్స్ కే చూడొచ్చు అంటున్నారు దిల్ రాజు. ఫ్యామిలీతో వచ్చి వెంకీ, వరుణ్ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ను ఎంజాయ్ చేయమంటున్నారు. అయితే మేము టికెట్ రేట్స్ పెంచట్లేదని చెప్పుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇలా వీడియో రిలీజ్ చేసి మరీ మేము టికెట్ రేట్స్ పెంచట్లేదని చెప్పేసారు దిల్ రాజు. మే 27న రిలీజ్ కానున్న ఎఫ్3ను నార్మల్ రేట్స్ కే థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చనేది దిల్ రాజు వెర్షన్. డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సునయన మధ్య చిన్న డ్రామాను ప్లే చేసి ‘ఎఫ్ 3’ సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడం లేదని స్పష్టం చేశారు. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకే టికెట్ అమ్ముతారనే ఓ హామీని నిర్మాత దిల్ రాజుతో ఇప్పించారు. ఈ వీడియోతో ఎఫ్3 టీమ్ రేట్స్ పై సరైన క్లారిటీని పక్కాగా ఇచ్చేసారు. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫ్3కి వచ్చేస్తాయి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఈ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.