ప్రసవం అయిన వెంటనే హెర్పెస్ ఇన్ఫెక్షన్ సోకి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నుంచే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని బీబీసీ పరిశోధనలో తెలుస్తోంది.

అసలేం జరిగింది? బ్రిటన్‌లో ఇద్దరు మహిళలకు 2018లో సిజేరియన్ కాన్పు జరిగింది. అయితే, ఈ రెండు మరణాలకూ ఒకదానికొకటి సంబంధం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఈ మరణాలపై విచారణను తిరిగి చేపట్టాలని మృతుల కుటుంబాలు కోరుతున్నాయి. ఇన్ఫెక్షన్ మూల కారణాన్ని ఆస్పత్రి కనిపెట్టలేకపోయిందని ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ ట్రస్ట్ చెబుతోంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కు వైరస్ ఉన్నట్లు తేలలేదని చెబుతోంది.

బ్రిటన్‌లో ప్రసూతి మరణాలు చోటు చేసుకోవడం చాలా అరుదు. అక్కడ 2017-2019 మధ్య కాలంలో 21 లక్షల జననాలు సంభవిస్తే, 191 మంది తల్లులు బిడ్డ పుట్టిన తొలి 6 వారాల్లో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతులు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్‌లోని హెచ్‌ఎస్‌వి – టైప్1 స్ట్రెయిన్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు ఎప్పుడూ వినలేదు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల నోటి చుట్టూ లేదా జననేంద్రియాల దగ్గర పుండ్లు వస్తాయి.

2018మే, జులైలో ఈ వైరస్ సోకి ఇద్దరు మహిళలు మరణించారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఈ రెండు మరణాలకూ సంబంధం ఉన్నట్లు ఆయా కుటుంబాలకు తెలపలేదు. కింబర్లీ శ్యాంప్ సన్ (29 సంవత్సరాలు) తన మూడేళ్ళ కూతురితో కలిసి కెంట్‌లోని విట్‌స్టేబుల్ పట్టణంలో ఆమె తల్లితో కలిసి నివసించేవారు. “తను ఎప్పుడూ సరదాగా ఉండేది. ప్రేమగా ఉండేది. చాలా మంది స్నేహితులుండేవారు. ఆమె ఒక మంచి అమ్మగా ఉండాలని కోరుకునేది” అని యివేట్ శ్యాంప్‌సన్ బీబీసీకి చెప్పారు. 2018 మే 3న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో మార్‌గేట్‌లోని క్వీన్ మదర్ హాస్పిటల్‌లోని క్వీన్ ఎలిజబెత్ ప్రసూతి వార్డులో చేర్చారు.

“అంతా బాగుంటుందనే అనుకున్నాం. కానీ, పరిస్థితులు మారిపోవడం మొదలయింది. ఎంతకీ బిడ్డ బయటకు రాకపోవడంతో, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆమెకు కొడుకు పుట్టాడు. కానీ, కింబర్లీకి రక్తం ఎక్కించాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత తల్లీబిడ్డలను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తామని చెప్పారు. కానీ, ఆమె అప్పటికే భరించలేని నొప్పితో బాధపడుతోంది. నడవడం కూడా కష్టంగా ఉంది. ఆమె తల్లితో కలిసి ఇంటికి వెళ్లారు.