ఇదిలా ఉంటే కాంతారా సినిమా కంటే ముందు కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రిషబ్. బెల్‌బాటమ్, హీరో చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే రిషబ్ నేరుగా ఓ తెలుగు చిత్రంలోనూ కనిపించాడు తెలుసా?.
కాంతారా సినిమాతో నేషనల్ లెవెల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా ఆయనే వహించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్‌లోనూ సంచలన విజయం సాధించింది. విడుదలై నెల రోజులు గడిచిపోతున్నా అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక తెలుగులోనూ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కాంతారా సినిమా కంటే ముందు కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రిషబ్. బెల్‌బాటమ్, హీరో చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే రిషబ్ నేరుగా ఓ తెలుగు చిత్రంలోనూ కనిపించాడు తెలుసా?. అది కూడా ఒక్క పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండానే. ఇంతకీ ఈ సినిమా మిషన్ ఇంపాజిబుల్. తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేం స్వరూప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు రిషబ్.
ఈ సినిమాలో ఖలీల్ అనే ఓ చిన్న దొంగ పాత్రలో కనిపించారు కన్నడ హీరో. కనిపించేది 2-3 నిమిషాలైనా సినిమాను మలుపు తిప్పే పాత్ర అది. ఈ మూవీ డైరెక్టర్ స్వరూప్, రిషబ్‌కు మంచి స్నేహితుడట. దీనికి తోడు స్వరూప్ తీసిన మొదటి సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ బాగా నచ్చడంతో తనను కలిసినప్పుడు రిషబ్ శెట్టి ఆయనను అభినందించాడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్ పాత్ర చేయమని అడగ్గా రిషబ్ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కాగా ఇదే సినిమాలో హీరో సుహాస్, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ కూడా క్యామియో పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇలా ఈ ముగ్గురూ కనిపిస్తున్న ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. కాగా కాంతారా ఘన విజయం సాధిచంగానే సందీప్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సెట్‌లో రిషబ్‌తో కలిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పాడు.