
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, చిరు ఈ సినిమాలో మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘తార్ మార్ తక్కర్ మార్’కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, చిరు ఈ సినిమాలో మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘తార్ మార్ టక్కర్ మార్’కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
పెప్పీ నెంబర్‌గా వస్తున్న ఈ పాటలో మెగాస్టార్ చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కలిసి చిందులేస్తున్నాడు. వారిద్దరు చేసిన స్వాగ్ మూమెంట్స్ ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘తార్ మార్ టక్కర్ మార్’ అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో మెగా ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. ఇక ఈ పాటకు సంబంధించిన ఫుల్ సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాలో అందాల భామ నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాధ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, రామ్ చరణ్, ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.