Sai Pallavi: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రం అద్భుతమైన కథాంశంతో రాబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో వస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి ముఖ్య కారణంగా హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పాలి.
ఆమె ఈ సినిమాలో మరోసారి తనదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా, దానికి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ ట్రైలర్‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా తనదైన మార్క్ కామెంట్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందేనంటూ కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఇక తాను సాయి పల్లవి అభిమానినంటూ కరణ్ జోహార్ చెప్పడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్‌ఫాంలో ఉన్న హీరోయిన్‌గా సాయి పల్లవి దూసుకెళ్తోంది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే, ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యే విధంగా చూసుకుంటోంది. ఇప్పుడు తాజాగా విరాటపర్వం సినిమాలో కూడా అమ్మడి యాక్టింగ్ ఈ సినిమాకు మరింత బలాన్ని అందించనున్నట్లు ట్రైలర్ చూస్తూ అర్థమవుతోంది. ఏదేమైనా కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇలా సాయి పల్లవి అభిమాని అని చెప్పడంతో, ఈ బ్యూటీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.